Allu Arjun: కేరళలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం

ABN , Publish Date - May 04 , 2026 | 08:02 PM

త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది.

Allu Arjun

కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Kerala Allu Arjun Fans) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలకు అక్కడి ప్రేక్షకులు ఎప్పుడూ మంచి స్పందన, క్రేజ్ ఉంటుంది. అంతేగాక అక్క‌డ ర్జున్‌కు ప్ర‌త్యేక‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇటీవల కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

కేరళ స్టేట్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను మరింతగా ఒక తాటిపైకి తీసుకురావడం, అసోసియేషన్ కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సమన్వయంలో జరిగిన ఈ మీటింగ్‌లో కొత్త ప్రణాళికలు రూపొందించారు.

దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ఈ సంఘం, త్వరలోనే నార్త్ ఇండియాలో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇక జూన్ 4న సౌత్ ఇండియా స్థాయిలో గ్రాండ్ మీటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Updated Date - May 04 , 2026 | 08:36 PM