అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మాములుగా లేరుగా

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:41 PM

సామాజిక సేవలోనూ తమదైన ముద్ర వేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మరోసారి ప్రశంసలు అందుకుంటోంది.

allu arjun

సామాజిక సేవలోనూ తమదైన ముద్ర వేస్తూ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ (Swasth Nari Viksit Bharat) కార్యక్రమానికి మద్దతుగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 820 పాఠశాలలు, కమ్యూనిటీల్లో ప్రత్యేక అవేర్‌నెస్ ఈవెంట్లు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్-నికోబార్ దీవుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 3 లక్షల మంది బాలికలు, యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం యువతల్లో చైతన్యం పెంచాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఒకే వేదికపైకి రావడం విశేషం. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుండే AAFA, ఈ భారీ అవగాహన యజ్ఞం ద్వారా అభిమాన సంఘాలు కూడా సామాజిక మార్పుకు వేదిక కావచ్చని నిరూపించింది.

అంతేగాక హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై సరైన సమాచారం ప్రతి బాలికకు చేరాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం అనేక వర్గాల ప్రశంసలు అందుకుంటోంది. అభిమానుల సమష్టి కృషితో సాధించిన ఈ ఘనత, సామాజిక బాధ్యత పట్ల AAFA నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది.

Updated Date - Sep 10 , 2026 | 06:46 PM