AA22xA6: బన్నీ చేయాల్సిన కసరత్తులు చాలానే ఉన్నాయ్.. 

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:48 PM

అల్లు అర్జున్, అట్లీ  సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారంతా. అయితే ఈ సినిమా 2026లో కూడా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.  


గడిచిన ఏడాది అల్లు అర్జున్‌ (AA22xA6) నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. డిసెంబరు, 2024లో ‘పుష్ప 2’ వచ్చింది. 2025 అంతా.. అట్లీతో (Atlee) సినిమా చర్చలు, కొంతమేర షూటింగ్‌తోనే గడిపేశారు. ఈ యేడాది వేసవికి  షూటింగ్‌ పూర్తవుతుందని, 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారంతా. అయితే ఈ సినిమా 2026లో కూడా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ యేడాది అక్టోబరు వరకూ బన్నీ ఈ సినిమాకు డేట్లు కేటాయించారట. ఆ తరవాత వీఎఫ్‌ఎక్స్‌కి సంబంధించిన పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయని చిత్ర వర్గాల నుంచి సమాచారం. 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయినా దర్శకుడు ఇంకా స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద స్టార్‌ అయినా, వేగంగా సినిమా తీయడం అట్లీకి అలవాటే. అలా చూస్తే ఈ సినిమా వేసవికి రెడీ అయిపోతుంది అనుకున్నారు. 

కానీ వీఎఫ్‌ఎక్స్‌ పనుల్లో జాప్యం, మధ్యలో కొన్ని బ్రేకులు వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. మేకింగ్‌ విషయంలో అట్లీ రాజీ పడకపోవడం వల్ల కూడా సినిమా ఆలస్యం అవుతోంది. లేట్‌ అయినా సరే, క్వాలిటీ ప్రోడక్ట్‌ ఇవ్వాలన్ని బన్నీ పాయింట్‌. అందుకే.. 2027 వరకూ ఈ సినిమా రాకపోవొచ్చు. అట్లీ సినిమా పూర్తయ్యే వరకూ బన్నీ మరో సినిమా చేయడా, లేక మరో ప్రాజెక్ట్‌ టేకప్‌ చేస్తాడా అన్నది చూడాలి. ఈ సినిమా పూర్తవ్వకుండానే మరో సినిమా స్టార్ట్‌ చేయాలనుకుంటే బన్నీ దగ్గర ఆప్షన్లు బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్‌, బోయపాటి శ్రీను, లోకేశ్‌ కనగరాజ్‌.. ఇలా కొందరు దర్శకుల బన్నీ కోసం కథలు రాసుకుపెట్టారు. ఓ బాలీవుడ్‌ దర్శకుడు కూడా బన్నీని కలిసి కథ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్‌.

Updated Date - Jan 03 , 2026 | 01:03 PM