అల్లు అర్జున్ గొప్ప మ‌న‌సు.. వేట్ల‌పాలెం యువ‌తికి జీవితాంతం ఆర్థిక సాయం

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:30 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AlluArjun ) మ‌రోమారు త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు.

allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AlluArjun ) మ‌రోమారు త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఇటీవ‌ల కాకినాడ (Kakinada) వేట్లపాలెం (Vetlapalem)లో జరిగిన పేలుడు ఘటనలో తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిన దుర్గ (Kadimpalli Durga) అనే మానసిక దివ్యాంగురాలికి అల్లు అర్జున్ అండగా నిలిచారు.

ఆమె పోష‌ణ బాధ్య‌త స్వీక‌రించిన అర్జున్... దుర్గ పోషణ, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి నెలా రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

allu arjun

ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేట్లపాలెం వెళ్లి దుర్గ, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:33 AM