Allu Arjun Sandeep Reddy Vanga: అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా కాంబో! థియేటర్లు.. తగలబడాల్సిందే
ABN , Publish Date - Jan 25 , 2026 | 06:13 PM
గతేడాది పుష్ప సినిమాతో దేశాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
గతేడాది పుష్ప సినిమాతో దేశాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లోనే ఉండగానే ఇటీవల మరో తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తో తన 23వ మూవీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రచ్చ లేపాడు. దీంతో రెండు రోజులుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది. ఇదిలాఉండగానే అట్లీ సినిమా అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తో సినిమా ఫిక్స్ అయిందనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఫ్యాన్స్కిరెక్కి పోతున్నారు.
విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు నాట ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆపై కబీర్ సింగ్ చిత్రంలో నేషనల్ లెవల్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఆయన యానిమల్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే పాన్ ఇండియాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తొలుత అర్జున్ రెడ్డి చిత్రాన్ని అర్జున్‌తోనే తీయాలని సందీప్ భావించనప్పటికీ ఆ ప్రాజెక్టు చివరకు విజయ్ దేవరకొండకు దక్కి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు.
ఈ సినిమా అనంతరం పలు సందర్భాల్లో అర్జున్‌తో ఓ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని సందీప్, టీ సిరీస్ నిర్మాతలు చెబుతూ వచ్చారు. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని చాలాకాలంగా ప్రచారం జరిగింది గానీ ఆ తర్వాత మరో కొత్త అప్డేట్ లేక ఇక సినిమా ఉండదని అంతా అనుకున్నారు. అంతేగాక యానిమల్‌తో సందీప్ బాలీవుడ్‌లో బిజీ కావడం, దానికి సీక్వెల్స్ ఉంటాయని చెప్పడం ఈ లోపు ప్రభాస్‌తో సినిమా లైన్‌లోకి వచ్చి అర్జున్‌తో సినిమా మరుగున పడిపోయింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ సినిమాను నిర్మిస్తోన్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan kumar) ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు. ఆయన ఓ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్, ఆపై యానిమల్ పార్క్ అనంతరం అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ 25వ సినిమా కానుండడం విశేషం. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాల అనంతరం సుకుమార్‌తో పుష్ప3 పూర్తయ్యాక 2028లో ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అప్పటిలోగా సందీప్ స్పిరిట్, యానిమల్ పార్క్ చిత్రాలు పూర్తయ్యాక తెరకెక్కించే సినిమా అల్లు అర్జున్‌దే కానుంది.