అల్లెల్లే.. అల్లెల్లే.. మహేష్ కొడుకు డ్యాన్స్ అదరగొట్టేశాడు

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:48 PM

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram).

Srinivasa Mangapuram

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఘట్టమనేని వారసుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni Jayakrishna)హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా శ్రీనివాస మంగాపురం నుంచి మొదటి లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లెల్లే అల్లెల్లే అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జయకృష్ణ, రషా కెమిస్ట్రీ చాలా బావుంది. జీవీ ప్రకాష్ సంగీతం వహించి. ఆలపించిన ఈ సాంగ్ కు శ్రీమణి లిరిక్స్ అందించారు. విలేజ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆర్ఎక్స్ 100 లో మనసును పట్టి సాంగ్ ను గుర్తుచేస్తోంది. బైక్ పై హీరో హీరోయిన్లు.. ఊరంతా తిరుగుతూ తమ ప్రేమను ఒకరితో ఒకరు పంచుకుంటున్నట్లు కనిపిస్తుంది. లిరిక్స్, మ్యూజిక్ , విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే జయకృష్ణ, రషా డ్యాన్స్ వేరే లెవెల్.. చిన్న చిన్న మూమెంట్స్ అయినా కూడా చాలా అందంగా చేశారు. ముఖ్యంగా జయకృష్ణ మూవ్స్ అయితే అద్భుతమని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా జయకృష్ణకు హిట్ ను అందిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Updated Date - Apr 29 , 2026 | 03:07 PM