Akkineni Nagarjuna: టబుతో రొమాన్స్.. నాగార్జున ఏం చెప్పారంటే

ABN , Publish Date - Jan 28 , 2026 | 09:37 PM

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వందవ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రా. కార్తీక్ (Ra. Karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతేడాది పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వందవ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రా. కార్తీక్ (Ra. Karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతేడాది పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కుబేర, కూలీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన నాగ్.. ఇప్పుడు పూర్తిగా తన వందవ సినిమాతోనే బిజీగా మారారు. ఈ చిత్రంలో నాగ్ సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారని, అందులో సీనియర్ హీరోయిన్ టబు (Tabu) కూడా ఉందని వార్తలు వచ్చాయి. నాగార్జున, టబు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెల్సిందే. వీరిద్దరి కాంబోలో నిన్నే పెళ్లాడతా, ఆవిడే మా ఆవిడ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇక కింగ్ 100 వ సినిమాలో టబు ముచ్చటగా మూడోసారి నాగ్ తో రొమాన్స్ చేయనుందని టాక్ నడుస్తోంది.

తాజాగా తన వందవ సినిమాలో టబు నటిస్తోంది అన్న వార్తలపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ' టబు నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితులం. నేను వందవ సినిమా చేస్తున్నాను అని తెలుసుకొని టబు అందులో భాగం కావాలని కోరుకుంది' అని తెలిపారు. నాగ్ వ్యాఖ్యలు టబు తన వందవ సినిమాలో నటిస్తోందని కన్ఫర్మ్ చేసినట్లే ఉన్నాయని చెప్పొచ్చు.

నాగార్జున కింగ్ 100 వ సినిమా గురించి మాట్లాడుతూ.. ' ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. వారి అభిరుచికి తగ్గట్లే మేము కూడా మారుతున్నాము. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ రియల్ గా చేస్తున్నాం. ఎలాంటి విఎఫ్ఎక్స్ ఉపయోగించడం లేదు. త్వరగా రిలీజ్ చేయాలని కంగారు పడకుండా నెమ్మదిగా సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.

Updated Date - Jan 28 , 2026 | 09:39 PM