రామ్‌చరణ్ కోసమే.. ‘లెనిన్’ మళ్లీ వాయిదా..
ABN , Publish Date - Mar 28 , 2026 | 07:39 PM
అక్కినేని అఖిల్ (AKhil) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అక్కినేని అఖిల్ (AKhil) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడుతూ మే 1న విడుదలకు సిద్దమైంది. సినిమాకు సంబంధించి సరైన ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాకపోవడం రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా మే 1వ తేదిన కూడా సినిమా విడుదల కాదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 30న మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రం విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి తగినంత స్పేస్ ఇవ్వాలని భావించి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. జూన్ 26న లెనిన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’ అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఇండస్ర్టీలోని హీరోల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని మరోసారి చాటి చెప్పినట్లయింది.