లెనిన్.. షాకింగ్ క్లైమాక్స్.. అఖిల్ కి బ్రేక్ దొరుకుతుందా!?

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:37 PM

అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. కానీ, ఇప్పటివరకు ఆ హిట్ వచ్చింది లేదు.

Lenin

అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. కానీ, ఇప్పటివరకు ఆ హిట్ వచ్చింది లేదు. అయితే ఈసారి అఖిల్.. లెనిన్ (Lenin) తో హిట్ కొట్టేలా ఉన్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ సినిమాను అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


లెనిన్ సినిమాలో అఖిల్ అక్కినేని పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. లెనిన్ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని షాకింగ్ కి గురిచేస్తోందంట. అదేంటంటే.. అఖిల్ కి ఈ చిత్రంలో కళ్ళు పోతాయంట. అంటే అంధుడిగా అఖిల్ కనిపించనున్నాడని అంటున్నారు. మరికొందరు భాగ్యశ్రీకి కళ్ళు పోవడంతో.. అఖిల్ తన ప్రేమ కోసం తన కళ్ళను ఆమెకు దానం చేస్తాడని చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్ నడుస్తోంది.


ఒకవేళ అఖిల్ అంధుడిగా కనిపించడం నిజమైతే అఖిల్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. పెద్ది సినిమాలో రామ్ చరణ్ కాలు లేకుండా కనిపించాడు. కానీ, ఎమోషన్ సరిగ్గా లేకపోవడం.. లాజిక్ మిస్ అవ్వడంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అలా కాకుండా లెనిన్ లో కళ్ళు పోయే సీన్ దగ్గర ఎమోషన్ క్యారీ అయితే లెనిన్ సక్సెస్ అందుకున్నట్టే. అలా కాదని తేడా కొడితే మాత్రం అఖిల్ సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మిగిలిపోతాడు. ఈ కథను నాగార్జున కూడా చాలా పొగిడాడు అంటే.. అఖిల్ నటనకు మంచి మార్కులు పడతాయని నమ్మొచ్చు. అదే గుద్ది నమ్మకంతో అయ్యగారు అంధుడిగా నటించడానికి ఒప్పుకున్నారు అని అర్ధమవుతుంది. జూన్ 26 న లెనిన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి అయ్యగారు లెనిన్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 06 , 2026 | 06:05 PM