అక్కినేని ఇంట ఆస్తి తగాదాలు.. అఖిల్ ఏమన్నాడంటే

ABN , Publish Date - Jul 25 , 2026 | 07:26 PM

ఆ నలుగురు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. 'రూపాయి రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే.. హరిశ్చంద్రుడు చేత అబద్దం ఆడిస్తాను. భార్యభర్తలమధ్య చిచ్చుపెడతాను.

Akhil Akkineni

ఆ నలుగురు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. 'రూపాయి రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే.. హరిశ్చంద్రుడు చేత అబద్దం ఆడిస్తాను. భార్యభర్తలమధ్య చిచ్చుపెడతాను. తండ్రి బిడ్డలను విడదీస్తాను.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను.. ఆఖరికి ప్రాణస్నేహితులను కూడా విడగొడతాను అందంట'. ప్రస్తుతం ఈ సమాజంలో రూపాయి అదే చేస్తుంది. కేవలం సామాన్యుల ఇంట్లోనే కాదు సెలబ్రిటీల ఇళ్ళల్లో కూడా ఇలానే జరుగుతుంది. ఇండస్ట్రీలో తల్లిదండ్రుల ఆస్తుల కోసం రోడ్డు మీద కొట్టుకున్న పిల్లలు ఎంతోమంది.


ఇక ఈ మధ్య అయితే మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఆస్తి తగాదాలు ఏ రేంజ్ వరకు వెళ్లాయో అందరికీ తెలుసు. విష్ణు, మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదు. ఈ తగాదాలాకు అదొక కారణం అని చెప్పొచ్చు. మంచు ఫ్యామిలీలానే అక్కినేని ఫ్యామిలీ కూడా. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులు ఒక తల్లి బిడ్డలు కాదు. ఒకవేళ ఇలాంటి ఆస్తి తగాదాలే ఆ ఇంట్లో కూడా తలెత్తుతాయా అంటే అస్సలు అలాంటి ఛాన్స్ లేదు అంటున్నాడు అఖిల్. ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న అఖిల్.. తన అన్న నాగ చైతన్యతో భవిష్యత్ లో ఆస్తి తగాదాలు రావు అని, అది తన తండ్రి పెంపకం అని చెప్పుకొచ్చాడు.


'అన్నయ్య నాగచైతన్యకు, నాకు మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు రాదు.. రాలేదు. ఎందుకంటే మా ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. మా బలం మా నాన్న. ఎవరైతే బాధ్యతతో ఆ ఆస్తిని సంపాదించారో.. వారు ఎవరిని ఎలా ఉంచాలో తెలుసు. నాన్న.. చిన్నప్పుడే ఆస్తుల గురించి కాకుండా కుటుంబ విలువల గురించి మాట్లాడేవారు. నీకు ఇంత.. నీకు ఇంత అని కాదు.. ఏదైతే ఆయన నాకు ఇవ్వాలనుకుంటారో అది ఇస్తారు.


ఆయన ఒకే మాట చెప్తారు. నేను బ్రతికి ఉన్నంతకాలం నీకు ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఇలాంటి ఆస్తి తగాదాలు వస్తాయని ఆయనకు బాగా తెలుసు. ఎవరికి వారు సంపాదించాలి. నీ సత్తా, నీ బలంతో పైకి రావాలి. నేను దానికి ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. కాకపోతే.. ఆ ఖర్చు నా జేబులో నుంచి రాకూడదు. ఇదే మా ఇంట్లో అందరూ పాటించే రూల్. మా తాతగారి నుంచి ఇదే నడుస్తుంది. ఎవరూ ఫ్రీగా డబ్బు తీసుకోలేదు. దీన్ని ప్రజలు వినడానికి ఇష్టపడరు కానీ, ఇదే నిజం. నేను కానీ, మా అన్నయ్య కానీ డబ్బులు ఫ్రీగా తీసుకోలేదు. నా సంపాదన నాది.. అన్నయ్య సంపాదన ఆయనది. మేము ఏదైతే సంపాదించుకున్నామో దానితోనే జీవిస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jul 25 , 2026 | 07:37 PM