త్రిగుణ్, పదినే కుమార్ జంటగా 'ఆకర్షిత'
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:40 PM
త్రిగుణ్, పదినే కుమార్ జంటగా నటిస్తున్న సినిమా 'ఆకర్షిత'. సూరిశెట్టి కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోకసిరెడ్డి రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
త్రిగుణ్ (Trigun) హీరోగా సూరిశెట్టి కిశోర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆకర్షిత' (Aakarshita). ఈ సినిమా ద్వారా తమిళ నటి పదినే కుమార్ (Padine Kumar) తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఫిబ్రవరి 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేశ్, రవివర్మ, ప్రియ ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా 'ఆకర్షిత' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షేక్ హజారత్ (వలి) కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శనివారం జరిగిన పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి (Vamsi Nandipati), వేణు స్వామి (Venu Swami), ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ (C. Kalyan) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, వేణుస్వామి స్క్రిప్ట్‌ను అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియ చిత్రానికి సంబంధించిన ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశారు. అనంతరం త్రిగుణ్ మాట్లాడుతూ, 'దర్శకుడికి, నిర్మాతలకు ఇది మొదటి చిత్రం. ఓ మంచి సినిమాతో మేమంతా మీ ముందుకు రాబోతున్నాం. ఈ చిత్రంలో నేను హీరోని కాదు రాజ్ కుమార్ కసిరెడ్డి హీరో. అతనితో పని చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు.

కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ, 'ఈ కథను రెండేళ్ల క్రితం విన్నాను. కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. త్రిగుణ్‌తో ఇది నాకు తొలి చిత్రం. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుంటుందనే ధీమాను దర్శక నిర్మాతలు సూరిశెట్టి కిశోర్, సందీప్ యాదవ్ వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో షేక్ హజరత్, రోలర్ రఘు, రవివర్మ, ప్రియ తదితరులు మాట్లాడారు.