మహేష్‌తో సినిమానా.. మామూలు మాటలు కాదు గురూ!
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:47 PM
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు.
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న మహేష్.. ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) తో చేస్తున్న వారణాసి (Varanasi)మూవీపై చిన్న విషయం కూడా వైరల్‌గా మారిపోతుంది.
గతంలో ఏ సినిమాకైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్లే మహేష్, ఈసారి మాత్రం జక్కన్న కోసం రూటు మార్చారు. రాజమౌళి సినిమా అంటే కేవలం నటన మాత్రమే కాదు, ఒక తపస్సు. అందుకే ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు మొత్తం మార్చేశారు. గతేడాది రిలీజైన వారణాసి గ్లింప్స్ చూశాక ఫ్యాన్స్‌కి ఒక్కటే అర్థమైంది. ఈసారి బాక్సాఫీస్ దగ్గర వేట మామూలుగా ఉండదు అని. పాన్ ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ ఆడియెన్స్‌ను మెప్పించేలా రాజమౌళి ఈ కథను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేశారు.
సాధారణంగా రాజమౌళి సెట్స్‌లో హీరోలకు చుక్కలు కనిపిస్తాయనే పేరుంది. ప్రతి చిన్న ఎక్స్‌ప్రెషన్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ఆయన వదలరు. మహేష్ కూడా జక్కన్న చెప్పే ప్రతి సూచనను తూచా తప్పకుండా పాటిస్తూ, తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్. తన పూర్తి ఫోకస్ కేవలం వారణాసి మీదనే పెట్టారు. సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఆ గ్లింప్స్ చూస్తేనే మనకు అర్థమవుతోంది.
మహేష్ - రాజమౌళి కాంబో అనగానే బిజినెస్ పరంగా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే, మహేష్ తదుపరి ప్రాజెక్ట్ కోసం అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ రేసులో ఉండగా.. కేజీఎఫ్, సలార్ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ తో పాటు సన్ పిక్చర్స్ కూడా మహేష్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఏషియన్ ఫిల్మ్స్ (Asian Films) బ్యానర్ మరో సెన్సేషనల్ ప్లాన్ చేస్తోంది. యానిమల్ మూవీతో ఇండియన్ సినిమాను ఊపేసిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో మహేష్ సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మహేష్ అడిగిన దానికంటే ఎక్కువే రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఈ భారీ ప్రొడక్షన్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం సూపర్ స్టార్ క్రేజ్ ఏ లెవల్‌లో ఉందో. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రస్తుతానికి తన ఆలోచనలన్నీ కేవలం రాజమౌళి సినిమా చుట్టూనే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయి, వరల్డ్ వైడ్‌గా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూసిన తర్వాతే తన తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.