Allu Arjun: అట్లీ అయ్యిపోయాడు.. ఇప్పుడు లోకేష్ తోనా బన్నీ

ABN , Publish Date - Jan 04 , 2026 | 07:15 PM

పుష్ప 2: ది రూల్ ( Pushpa 2)' ప్రభంజనం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పాన్ ఇండియా సరిహద్దులు దాటి గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ మెగా హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Allu Arjun

Allu Arjun: పుష్ప 2: ది రూల్ ( Pushpa 2)' ప్రభంజనం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పాన్ ఇండియా సరిహద్దులు దాటి గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ మెగా హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు టాక్. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా.. భారీ VFX వర్క్ కారణంగా ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ మూవీ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. తాజాగా అల్లు అర్జున్ లైన్ లోకి కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన సృష్టించిన 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' (LCU). అయితే ఈ యూనివర్స్ కంటే ముందే లోకేష్ మనసులో ఒక అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట. అదే ‘ఇరుంబు కై మాయావి’. గతంలో ఈ కథ కోసం సూర్య, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ సబ్జెక్ట్ మన ఐకాన్ స్టార్ వద్దకే చేరినట్లు సమాచారం. ఈ కథలోని హీరోకి ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత హీరో తన ఎడమ చేతిని కోల్పోతాడు. ఆ స్థానంలో ఒక శక్తివంతమైన 'మెటల్ హ్యాండ్' అమరుస్తారని సమాచారం. దీంతో ఈ కథ చెప్పినట వెంటనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి అల్లు అర్జున్ కానీ, లోకేష్ కనగరాజ్ కానీ ఈ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 2026 జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని ఫిల్మ్ నగర్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ మార్క్ టేకింగ్‌తో పాటు బన్నీ అద్భుతమైన మేనరిజమ్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 07:17 PM