‘RX 100’ త‌ర్వాత‌.. కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:40 AM

హీరో కృష్ణ మనవడు జయ‌కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శ్రీనివాస మంగాపురం’.

Srinivasa Mangapuram

హీరో కృష్ణ మనవడు జయ‌కృష్ణ (Jaya Krishna Ghattamaneni)ను హీరోగా పరిచయం చేస్తూ అజయ్‌ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram)చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్‌ భూపతి విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘ఇది పూర్తిస్థాయి ప్రేమకథాచిత్రం. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా కొన్ని సీన్లు రాశాను. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమాలో లవ్‌స్టోరీతో పాటు ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. మోహన్‌బాబు పాత్రతో పాటు ఇంకా చాలా మంచి పాత్రలు ఉన్నాయి. అన్నీ ఒరిజినల్‌ లొకేషన్స్‌లో తీశాం. సినిమా చాలా నాచురల్‌గా ఉంటుంది. పాటలు బాగుంటాయి. జైకృష్ణ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోతుంది. అలాగే హీరోయిన్‌ రాషా (Rasha Thadani) నటన కూడా ఆకట్టుకుంటుంది అన్నారు.

నిజానికి ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదని అనుకున్నా. కానీ ఈ సినిమా చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. విజయం పట్ల వంద శాతం నమ్మకంతో ఉన్నా’ అని చెప్పారాయన. ‘నేనెప్పుడూ నా స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ వెళతాను. కాకపోతే జైకృష్ణతో జర్నీ మొదలయ్యాక నేను ఎమోషనల్‌ అయ్యాను. ఎందుకంటే కృష్ణగారంటే నాకు చాలా అభిమానం. ఆయన లెగసీ నాకు తెలుసు.

జైకృష్ణ పర్సనల్‌గా నాకు చాలా నచ్చాడు. దగ్గరుండి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాను. మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా చూసి ‘అదిరిపోయింది’ అని మెసేజ్‌ పెట్టారు. జైకృష్ణ, రాషా జోడీ బాగుందని మెచ్చుకున్నారు. పాటలు, యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయన్నారు. సినిమా చాలా నచ్చిందని ఆయన మెచ్చుకున్నారు.’ అన్నారు అజయ్‌. చిత్రంలో మోహన్‌బాబు పాత్ర గురించి వివరిస్తూ ‘ఆయనది చాలా ఎమోషనల్‌ కేరెక్టర్‌. గత ఇరవై ఏళ్లలో ఆయన్ని ఇంత ఎమోషనల్‌గా ఆడియన్స్‌ చూసి ఉండరు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోయింది. సినిమాలో చివరి 30 నిముషాలు చూస్తున్నప్పుడు యూత్‌తో సహా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా జైకృష్ణ, మోహన్‌బాబు, రాషా మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండి హత్తుకుంటాయి. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

Updated Date - Jul 30 , 2026 | 11:40 AM