Mahesh Babu: అభిమానులకు.. బాబు.. ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తాడా?
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:51 PM
వారణాసి సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ సరికొత్త చర్చ జోరుగా సాగుతోంది. అదేంటంటే.. మహేష్ బాబు ఇప్పటికే ఈ సినిమాలో తన పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిగా కంప్లీట్ చేసేశారు.
సాధారణంగా జక్కన్న సినిమా అంటే ఏ హీరో అయినా ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్‌కు పూర్తిగా అంకితమైపోవాల్సి ఉంటుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ ఇలా ప్రతి విషయంలోనూ పర్‌ఫెక్షన్ కోరుకునే రాజమౌళి స్టైల్ మనకు స్పష్టంగా తెలుసు. అయితే వారణాసి విషయంలో మాత్రం మహేష్ తన వర్క్‌ను చాలా వేగంగా పూర్తి చేసేశారు. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉంది. విడుదల తేదీ దగ్గర పడేవరకూ చిత్ర యూనిట్ భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది. మరి ఈ ఐదు నెలల సుదీర్ఘ విరామంలో మహేష్ ఖాళీగా కూర్చుంటారా..? లేక తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తారా..?
అయితే టాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. మహేష్ ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. పలువురు అగ్రశ్రేణి నిర్మాతలు మహేష్‌తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని ఫిల్మ్ నగర్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ మహేష్ ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. కేవలం ప్రాజెక్ట్ సెట్ అవ్వడమే కాదు, తన ఇమేజ్‌కి తగిన కథతో పాటు సరైన విజన్ ఉన్న డైరెక్టర్ దొరికేవరకు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లకూడదని భావిస్తున్నారట.
వారణాసి తో మహేష్ మార్కెట్ కేవలం ఇండియాకే పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్‌కి విస్తరించబోతోంది. కాబట్టి ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా అదే స్థాయి కంటెంట్‌తో ఉండాలని ఆయన పక్కా ప్లాన్‌తో ఉన్నారు. మరి మహేష్ లిస్ట్‌లో ఉన్న ఆ దర్శకులు ఎవరు..? ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు ముగ్గురు సెన్సేషనల్ డైరెక్టర్లతో పాటు ఓ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కూడా మహేష్‌కు కథలు వినిపించినట్లు సమాచారం. అయితే ఏ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేస్తారనేది ఇప్పటికీ పూర్తి సస్పెన్స్‌గానే ఉంది.
కొందరేమో వారణాసి రిలీజ్ అయి ఫలితం చూసేవరకు ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయరని అంటుంటే.. మరికొందరేమో రాబోయే కొత్త సంవత్సరం కానుకగా లేదా సంక్రాంతి సందర్భంలోనే తన నెక్స్ట్ లైనప్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజమౌళి సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్.. ఈ లోపే తన నెక్స్ట్ మూవ్‌తో ఇండస్ట్రీని ఎలా ఆశ్చర్యపరుస్తారా..? లేక వారణాసి రిలీజ్ అయ్యే వరకు మహేష్ సైలెంట్‌గా ఉంటారా లేక ఈ ఐదు నెలల గ్యాప్‌లోనే నెక్స్ట్ మూవీని పట్టాలెక్కిస్తారా అనేది చూడాలి.