ఈసారి పక్కా.. ప్యారడైజ్ వచ్చేది అప్పుడే
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:03 PM
న్యాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం తన ఫోకస్ అంతా ది ప్యారడైజ్ (The Paradise)మీద పెట్టిన విషయం తెల్సిందే. హిట్ 3 తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొన్న నాని..
న్యాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం తన ఫోకస్ అంతా ది ప్యారడైజ్ (The Paradise)మీద పెట్టిన విషయం తెల్సిందే. హిట్ 3 తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొన్న నాని.. తన కెరీర్ లో తనకు దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెలతో కలిసి ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. మునుఒఎన్నడూ చూడని ఊర మాస్ నానిని ఈ సినిమాలో చూడబోతున్నామని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ద్వారా అర్ధమయ్యింది. అసలు అన్ని బావుండి ఉంటె ప్యారడైజ్ సినిమా రిలీజ్ కూడా అయ్యిపోయేది. కానీ, అనుకోని కారణాల వలన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.
ఇక ఈ వరుస వాయిదాల తర్వాత నాని అభిమానులకు ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ అందింది. ప్యారడైజ్ రిలీజ్ డేట్ లాక్ అయ్యిందని తెలుస్తోంది. అన్ని అడ్డంకులను దాటుకుని ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మళ్లీ ఎలాంటి ఆలస్యం జరగకూడదనే పట్టుదలతో చిత్రబృందం బుల్లెట్ వేగంతో పనులను పూర్తి చేస్తోంది. ఈసారి ఎలాగైనా అనుకున్న సమయానికే ప్రేక్షకులను పలకరించాలని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండకూడదని నిర్మాతలు ప్రతీ విషయంలోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట.
నాని మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సరికొత్త కథాంశంతో వస్తోన్న ది ప్యారడైజ్ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తోండగా.. మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే ఒక స్పెషల్ వీడియోతో రిలీజ్ డేట్ ని యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారట. మరి ఈ సెప్టెంబర్ రేసులో నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి