‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. ట్రైలర్ ఎప్పుడు వదులుతార్రా
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:22 PM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ట్రైలర్ టీజ్ అని ఓ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ (pawan kalyan) కథానాయకుడిగా హరీశ్ శంకర్ ( harish shankar) తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) నుంచి ట్రైలర్ టీజ్ అని ఓ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్‌కు అదిరిపోయే, రికార్డులు బద్దలయ్యే రెస్పాన్స్ వస్తుండడంతో ప్రస్తుతం అందరూ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉగాది సందర్భంగా ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. ఈ గ్లింప్స్‌లో ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత’ అనే సంభాషణ సినిమాపై అంచనాలు పెంచేసింది. పవన్ కాస్ట్యూమ్స్, లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వారికి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఆయన పాత్రను దర్శకుడు చాలా బలంగా మలిచారని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి 'కాలర్ ఎత్తరా' పాటను మేకర్స్ మార్చి 12న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం సాయంత్రం 4.36కి రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో శక్తిమంతమైన పోలీస్ పాత్రలో పవన్ కనిపించ నున్నారు. వీలైనంత త్వరగా ట్రైలర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. రాశీ ఖన్నా, శ్రీలీల కథానాయికలు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, నేపథ్య సంగీతం: ఎస్ థమన్.