జాబ్ మేళాకు.. వెళ్లిన వైష్ణవి చైతన్య
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:36 AM
ఓనా సిద్ధయ్య మూవీ టీమ్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు యువతీ, యువకులు భారీగా తరలివచ్చారు.
ఓనా సిద్ధయ్య (Oh Naa Siddhayya)మూవీ టీమ్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ (Hi-Tech City) లోని సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళా (Job Fair) కు యువతీ, యువకులు భారీగా తరలివచ్చారు. మంగళవారం నిర్వహించిన మేళాలో 70 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. వారిలో కొందరికి స్పాట్‌లో ఆఫర్ లెటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా సిద్ధూరెడ్డి (Siddu Reddy Kandakatla) మాట్లాడుతూ.. పాట అంటే తనకు ప్రాణమని.. భార్యాభర్తల మధ్య జరిగే భావోద్వేగ ప్రేమ కథతో ప్రాటను చిత్రీకరించామన్నారు. తన పాట చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని, దానికి గుర్తుగా యువతకు ఉపాధి కల్పించి తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలాఉంటే ఈ ఈ వెంట్‌లో సినీ నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), కాత్యాయిని (Katyayani) తదితరులు పాల్గొని కొత్త జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్ 300 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున భీమా చేయించారు. అంతేగాక ఈ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక విభాగాల సబ్యలుకు సైతం భీమా చేయించారు.