నటి నిశాంతి దర్శకురాలిగా ఇండీఫిల్మ్ 'ఇంప్యూర్'
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:54 PM
నటి నిశాంతి ఈవని... ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ఇంప్యూర్' ట్రైలర్ విడుదలైంది.
'ఎల్.బి.డబ్ల్యూ' (LBW) సినిమాతో టాలీవుడ్ లోకి నటిగా అడుగు పెట్టారు నిశాంతి ఈవని (Nishanthi Eevani). ప్రముఖ మ్యూజిక్ కండక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ ఇ.ఎస్. మూర్తి కుమార్తె ఆమె. 'మన్మధుడు -2'తో పాటు ఇటీవల వచ్చిన 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) మూవీలో నక్సలైట్ గా నటించి, మెప్పించారు నిశాంతి. నటిగానే కాకుండా దర్శకత్వ శాఖలోనూ అనుభవం ఉన్న నిశాంతి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఆమె 'ఇంప్యూర్' (Impure) పేరుతో ఇండీ ఫిల్మ్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన ఈ సినిమాలో సాయికృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా నందినీ రెడ్డి (Nandini Reddy) హజరయ్యారు.
ఈ సందర్భంగా నందినీరెడ్డి మాట్లాడుతూ, 'ఈ ఈవెంట్‌కి రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి మా బాస్ కృష్ణవంశీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే కాదనడానికి లేదు. రెండు దర్శకురాలి నిశాంతి. తనతో నాకు పదిహేనేళ్ళ పరిచయం. నాకు మంచి స్నేహితురాలు. రీసెంట్‌గా 'మా ఇంటి బంగారం'లో తను నటించింది. నిశాంతికి మంచి క్యారెక్టరే ఇచ్చాను. కానీ ఎడిటింగ్‌లో కొంత కట్ అయ్యింది. ఆమెతో కలిసి మళ్ళీ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ప్రతి తెలుగు వాళ్లకు ఒక సినిమా చేయాలని డ్రీమ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలో తెలుగు ఆడియెన్స్ చాలా గొప్పవాళ్లు. పృథ్వీ సార్‌ను అందరూ '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటారు. కానీ ఎవర్ గ్రీన్ పృథ్వీ. ఆయన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. ఆయన ముందే మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాం. పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. ఈ సినిమా మంచి హిట్టవ్వాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.

నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, 'డైరెక్టర్ నిశాంతి చేసిన కృషి గొప్పది. టాలెంట్‌ను వాళ్ల మదర్ ఎంకరేజ్ చేయడం నిజంగా గొప్ప విషయం. 'ఇంప్యూర్' సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. బాగా డబ్బులు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా నందిని రెడ్డి గారూ చాలా హార్డ్ వర్కర్. 'అలా మొదలైంది' నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు.
డైరెక్టర్ నిశాంతి మాట్లాడుతూ, 'ఒక మనిషి ప్యూర్‌గా ఉండాలా? ఇంప్యూర్‌గా ఉండాలా? అనేది సొసైటి డిసైడ్ చేస్తుంది. వారాహి వచ్చి నాకు కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను. ఒక పెళ్లి క్యాన్సల్ అవడం వల్ల ముగ్గురి పరిస్థితి ఎలా మారింది? అనేది ఈ సినిమా కథ. సంధ్య, ప్రణవ్, ధీర ముగ్గురి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన నందిని రెడ్డిగారికి ధన్యవాదాలు' అని అన్నారు. హీరో సాయికృష్ణ మాట్లాడుతూ, 'ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండటానికి నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం చాలా ఉంది. ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీదేవి గారికి చాలా థ్యాంక్స్. ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీ అవుట్ పుట్ కోసం బాగా ఖర్చుపెట్టారు. డైరెక్టర్ నిశాంతి గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం ఇచ్చారు. అలానే నాతో పాటు నటించిన యష్న, శ్రీవాణి గారికి ధ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అని అన్నారు. హీరోయిన్ యష్న మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నేను సంధ్య అనే పాత్ర చేశాను. నా క్యారెక్టర్ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. నాకు మంచి పాత్ర ఇచ్చిన నిశాంతి గారికి థ్యాంక్స్' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, నటుడు రామ్‌కీ కూడా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది
మళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్
Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు