Nidhhi Agerwal: ఇది కూడా పాయే.. తీవ్ర నిరాశలో నిధి అగర్వాల్
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:15 AM
తమిళం, తెలుగులో వరుస ఫ్లాపులతో హీరోయిన్ నిధి అగర్వాల్ నిరాశలో ఉంది. 2026లోనైనా కెరీర్‌కు బ్రేక్ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తోంది.
ఇటు తమిళం, అటు తెలుగు భాషల్లో సరైన హిట్ కోసం హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) పరితపిస్తున్నారు. ఈ రెండు భాషల్లో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. దీంతో ఆమె తీవ్ర నిరాశలో కూరుకునిపోయారు. గతంలో తమిళంలో 'భూమి' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నిధి అగర్వాల్ ఆ తర్వాత శింబు సరసన 'ఈశ్వరన్', ఉదయనిధి నటించిన 'కలగ తలైవన్' మూవీలో నటించారు ఈ మూడు చిత్రాలు ఆమెకు సరైన్ బ్రేక్ ను ఇవ్వలేకపోయాయి.
దీంతో తమిళంలో దక్కని విజయాన్ని తెలుగులో దక్కించుకుందామని ఎన్నో ఆశలతో అటువైపు వెళ్ళారు. అయితే గత యేడాది ఆమె నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), ఇటీవల వచ్చిన ది రాజా సాబ్ (The RajaSaab) మూవీలు ఆమెను మరింతగా నిరాశకు లోనుచేశాయి. దీంతో 2026లోనైనా తన కెరీర్‌కు మంచి బ్రేక్ లభిస్తుందన్న ఆశలో నిధి అగర్వాల్ ఉన్నారు. ఇదిలాఉంటే .. అమ్మడి చేతిలో ప్రస్తుతం ఏ సినిమా లేదు.