తిరుమల.. గాలిలోనూ గోవింద నామస్మరణ ఉంది
ABN , Publish Date - Feb 24 , 2026 | 09:33 AM
'టీటీడీ సిబ్బంది చేసేది సేవ కాదు, మహాయజ్ఞం' అని హీరోయిన్ మీనాక్షి చౌదరి కొనియాడారు.
'టీటీడీ (TTD) సిబ్బంది చేసేది సేవ కాదు, మహాయజ్ఞం' అని హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కొనియాడారు. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆమె టీటీడీ సేవలను ప్రశంసిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉచిత బస్టాండ్‌లో నిలబడడం, బస్సు ఎక్కి ప్రయాణించడం వంటి విజువల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వీడియోలో మీనాక్షి ఏమన్నారంటే 'దర్శనానికి తిరుమలకు వెళ్లి వచ్చిన తర్వాత నేను పొందిన అనుభూతి, ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. నేను తరచుగా తిరుమలకు వస్తుంటాను. తిరుమలలో గాలి కూడా గోవింద నామస్మరణ చేస్తుంది. మనసు ఎంత ఆందోళనగా ఉన్నా తిరుమలకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది. దర్శనానికి వస్తూ వెళుతూ ఓ విషయాన్ని గుర్తించాను. దర్శనం కోసం ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్న క్రమంలో టీటీడీ సిబ్బంది మనకు తెలియకుండా కష్ట పడుతుంటారు. మన తిరుమల యాత్రను టీటీడీ ఆనందంగా మారుస్తోంది. ఈ సందర్భంగా టీటీడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.