జ్యోతి పూర్వజ్.. కిల్లర్ టీజర్! ఒక్క సినిమాలో.. ఇన్ని వేరియేషన్సా
ABN , Publish Date - Feb 22 , 2026 | 09:50 PM
జ్యోతి పూర్వజ్, పూర్వజ్ జంటగా తెరకెక్కిన చిత్రం కిల్లర్ టీజర్ ఆదివారం రిలీజ్ చేశారు.
జ్యోతి పూర్వజ్(Jyothi Poorvaj),పూర్వజ్ (Poorvaj) జంటగా తెరకెక్కిన చిత్రం కిల్లర్ (Killer). పూర్వజ్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు ఎ. పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌ను చూస్తే జ్యోతి పూర్వజ్ మూడు, నాలుగు రకాల షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రల్లో నటించినట్లు అర్థం అవుతోంది. టెర్రరిస్టు, స్పై, పోలీస్ ఆఫీసర్, లవర్‌గా ఇలా విభిన్న పాత్రలకు సంబంధించిన వేరియేషన్స్‌తో అదరగొట్టింది. రొమాంటిక్ సన్నివేశాలలోనూ బికినీలు, ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ కైఫెక్కించేలా చేసింది. ఇలా మరెన్నో యూత్‌కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో, థ్రిల్లింగ్ అంశాలు, యాక్షన్ సీన్లతో సినిమాను రూపొందించినట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.