స్టేజ్ మీద సుడిగాలి సుధీర్ ని అవమానించిన బ్యాచిలర్ బ్యూటీ..
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:37 PM
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కిన చిత్రం గోట్ (GOAT - Greater of All Time). ఈ సినిమాతో కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి (Divya Bharathi) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కిన చిత్రం గోట్ (GOAT - Greater of All Time). ఈ సినిమాతో కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి (Divya Bharathi) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే తమిళ్, తెలుగులో బ్యాచిలర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అంటే మంచి అంచనాలే మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, డైరెక్టర్ మారడం, బడ్జెట్ సమస్యల మధ్య ఆగిపోయిన ఈ గోట్ ని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి అన్ని తన భుజాల మీద వేసుకొని సినిమాని ముగించాడు. ఇక ఈ సినిమాకి వేదవ్యాస్ దర్శకత్వం వహించినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా దివ్యభారతి తనను డైరెక్టర్ వేధించాడని, అయినా కూడా హీరో సుధీర్ చూస్తూ ఉన్నాడు కానీ, ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి హీరోతో పనిచేయడం చాలా బాధగా ఉందని కూడా తెలిపింది. ఈ ఇష్యూపై సుధీర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. మరి సినిమా కోసమో.. నిర్మాత చెప్పాడనో తెలియదు కానీ.. ప్రమోషన్స్ లో మాత్రం సుధీర్, దివ్యభారతి కలిసి వచ్చారు. తమ విభేదాల వలన సినిమా ప్రమోషన్స్ పాడు అవ్వకూడదు అని అనుకోవడం మంచి విషయమే. అయితే.. కరెక్ట్ గా టైమ్ చూసుకొని దివ్యభారతి.. సుధీర్ ని అవమానించిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. స్టేజ్ మీద హీరో సుధీర్ గురించి చెప్పకుండా.. అతని పేరు కూడా తీసుకురాకుండా స్పీచ్ ముగించి అవమానించింది.
తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా దివ్య భారతి స్టేజ్‌పై ఒక్కసారిగా భావోద్వేగానికి గురై వెక్కివెక్కి ఏడ్చింది. ఈ చిత్రానికి సంబంధించి తాను గత రెండేళ్లుగా ఎంతో ఎదురుచూశానని, ఎన్నో కష్టాలు దాటుకుని సినిమా ఇప్పడు ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెబుతూ ఆమె కంటతడి పెట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా మధ్యలో కొందరు వెనకడుగు వేయాలని చూసినా, నిర్మాత చంద్రశేఖర్ గారు ఎంతో పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడని ప్రసంశలు కురిపించింది. కేవలం ఫన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్, జూదం వంటి అంశాలపై బలమైన సామాజిక సందేశం ఈ చిత్రంలో ఉంటుందని తెలిపింది.
అందరి పేర్లు చెప్పిన దివ్యభారతి.. హీరో సుధీర్ పేరు చెప్పడం మరిచింది. మరవడం కన్నా.. కావాలనే అతని పేరును వదిలేసింది అని చెప్పొచ్చు. ఏ సినిమా వేడుకలో అయినా హీరోనే మెయిన్ హైలైట్. అందరూ హీరో గురించే మాట్లాడతారు. అతడిపై ప్రశంసలు కురిపిస్తారు. కానీ, ఈ హీరోయిన్ మాత్రం కావాలనే సుధీర్ పేరు చెప్పకుండా అవమానించిందని, సెట్ లో జరిగింది ఇంకా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇలా చేసిందని కొందరు ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో సుధీర్, దివ్యభారతి ఎలాంటి విజయాన్నీ అందుకుంటారో చూడాలి.