Aishwarya Rajesh: టాలీవుడ్‌పై గంపెడాశలు పెట్టుకున్నా.. అవ‌కాశాలు లేవు

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:13 AM

తెలుగు చిత్రపరిశ్రమపై తాను గంపెడాశలు పెట్టుకున్నానని, కానీ టాలీవుడ్ తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఆవేదన వ్యక్తం చేశారు.

Aishwarya Rajesh

తెలుగు చిత్రపరిశ్రమపై తాను గంపెడాశలు పెట్టుకున్నానని, కానీ టాలీవుడ్ తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిం దని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఆవేదన వ్యక్తం చేశారు. గత యేడాది తెలుగులో ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.

Aishwarya Rajesh

ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించారు. కానీ, ఆమెకు సరైన ఛాన్సులు రాలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ, "సంక్రాంతికి వస్తున్నాం" విజయం తర్వాత తెలుగులో పెద్ద దర్శకులు, హీరోల చిత్రాల్లో ఆఫర్లు వస్తాయని భావించాను. కానీ, రాలేదు. ఇది నన్ను తీవ్ర నిరాశకు లోనుచేసింది.

Aishwarya Rajesh

ఇప్పుడు యువ నటుడు తిరువీర్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. ఒకవేళ తెలుగు దర్శకులకు నా ప్రతీభపై ఏదేని సందేహం ఉండివుండొచ్చు. అయితే, ఇపుడు నేను నటి స్తున్న 'ఒరు సుకుమారి' మూవీ ఖచ్చితంగా ఆ అనుమానాలను పటా పంచలు చేస్తుంది' అని పేర్కొన్నారు.

Aishwarya-Rajesh--9

Updated Date - Feb 02 , 2026 | 07:12 AM