శ్రీవారి సేవలో సినీతారలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:03 AM
తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ సమయంలో హీరో అడివి శేషు, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, అనన్య నాగళ్ల , అర్చన అయ్యర్, నీలిమ రాణి దర్శించుకున్నారు.
తిరుమల (Tirumala Tirupati Temple) శ్రీవారిని వీఐపీ బ్రేక్ సమయంలో హీరో అడివి శేషు (Adivi Sesh), హీరోయిన్లు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), అనన్య నాగళ్ల (Ananya Nagalla), అర్చనా అయ్యర్ (Archana Iyer), నీలిమా రాణి దర్శించుకున్నారు.
అనంతరం మృణాల్ మీడియాతో మాట్లాడుతూ, తాను తొలిసారిగా శ్రీవారి దర్శనం కోసం వచ్చానని, స్వామి దర్శనం తర్వాత చాలా ఆనందం కలిగిందన్నారు.
డెకాయిట్ (Dacoit Movie) చిత్రం విజయవంతం కావాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. తర్వాత అడివి శేషు మాట్లాడుతూ, తిరుపతి ఐఐటీలో తిరుత్సవ్ కార్యక్రమానికి హాజరై డెకాయిట్ చిత్రంలోని ఓ పాటను విడుదల చేశామన్నారు.