Suman: సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మీ బట్టలు ఎలా ఉండేవి..

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:25 PM

నటుడు సుమన్ (Suman).. శివాజీ (Shivaji) వ్యాఖ్యలపై స్పందించాడు. ఆడవారి డ్రెస్సింగ్ గురించి ఆయన అలా మాట్లాడడం తప్పు అని చెప్పుకొస్తూనే మహిళలు ఎలా ఉండాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పుకొచ్చాడు.

Suman

Actor Suman: నటుడు సుమన్ (Suman).. శివాజీ (Shivaji) వ్యాఖ్యలపై స్పందించాడు. ఆడవారి డ్రెస్సింగ్ గురించి ఆయన అలా మాట్లాడడం తప్పు అని చెప్పుకొస్తూనే మహిళలు ఎలా ఉండాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పుకొచ్చాడు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. ' శివాజీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. కాకపోతే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్. అమ్మాయిలు.. బయటకు వెళ్లేముందు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తమ కులాన్ని, తల్లిదండ్రుల స్టేటస్ ని, గౌరవానికి తగ్గట్లు బట్టలు వేసుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్లదే. కాకపోతే వారి కంఫర్ట్ కి తగ్గట్లు వేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.

ఇంట్లో ఉన్నప్పుడు మహిళలు నైటీలు వేసుకుంటారు. ఎవరైనా వస్తే కొంచెం రెడీ అవుతారు. బయటకు వెళ్తే వారికి నచ్చినట్లు రెడీ అవుతారు. అలా వారి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవచ్చు. ముఖ్యంగా దేవాలయాలకు వచ్చేముందు మాత్రం అలోచించి బట్టలు వేసుకోండి. మాకు ఉన్నాయి కదా అని ఒంటినిండా నగలు వేసుకొని వస్తే.. అక్కడ పేదవాడు చూసి దేవుడా మేము ఏం పాపం చేశామని మాకు ఇలాంటి పేదరికం ఇచ్చావు అని కుమిలిపోతాడు. దేవాలయంలో అందరూ సమానంగా ఉండాలి.

ఇక హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉంటున్నారు అని చెప్పుకొస్తున్నారు. వారి వృత్తిని బట్టి వారు బట్టలు వేసుకుంటారు. సినిమాలో డైరెక్టర్, నిర్మాత గ్లామర్ ఎక్కువగా కావాలనుకుంటారు. ఎందుకంటే వారి సినిమా ఆడాలని అలా చేస్తారు. ఒక వేశ్య పాత్ర ఉంటే దానికి నిండుగా బట్టలు కప్పుతారా.. ? లేదు కదా. అది ఎలా ఉంటే అలానే చూపించాలి. అదంతా సెన్సార్ చూసుకోవాలి. ఆ సీన్ ని, ఎక్కడ ఆపాలి.. ఎక్కడ కట్ చేయాలి అనేది వారికి తెలియాలి. సెన్సార్ సభ్యులుగా ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఏపీఎస్ లాంటివారిని పెట్టండి.. లేకపోతే సెన్సార్ తీసేయండి.

అందం చూసి సినిమాలకు వస్తారు అంటే.. ఐటెం నెంబర్స్ కు వేరు. కానీ, అలాంటివేమీ లేని సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి. స్క్రీన్ మీద ఎలా ఉన్నా కూడా రియల్ లైఫ్ కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది చేసినా అది క్యారెక్టర్.. కనై బయట రియల్ లైఫ్. ఆరోజుల్లో విజయ్ లలిత, జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్క్ స్మిత.. వాళ్ళు స్క్రీన్ వరకు డ్యాన్స్ కి సంబంధించిన డ్రెస్ వేసేవారు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం అస్సలు మేకప్ కూడా లేకుండా వచ్చేవారు. మేమె గుర్తుపట్టలేకపోయేవాళ్ళం. అక్కడ చేసింది వీరేనా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. అంత నీట్ గా ప్రవర్తించేవాళ్ళు. వారు ఆ పనిని దైవంగా భావించేవారు.

అసలు డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అది పక్కా ప్రొపెషన్. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ డ్రెస్ మారేది. అలా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ, ఇప్పుడు హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే డ్రెస్ వేస్తే.. జనాలు రకరకాల మెంటాలిటీలతో ఉన్నారు. తాగి వస్తారు.. డ్రగ్స్ తో వస్తారు.. సైకో లు ఉంటారు. ఇలాంటివారికి చట్టాలు లేవు. వాళ్ళను ఆపలేరు. ఇలాంటి షోస్ విదేశాల్లో జరిగితే.. ఎవరికి నచ్చినట్లు బట్టలు వేసుకుంటారు. అక్కడ కల్చర్ వేరు. అక్కడేమి జరగడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే.. చట్టాలు మారాలి.. సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడే మహిళలకు గౌరవం, మర్యాద ఉంటుంది.

Updated Date - Jan 05 , 2026 | 06:27 PM