Shivakrishna: ప్రకాష్ రాజ్ కి కండకావరం ఎక్కువ.. బ్యాన్ చేయాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 08:45 PM

గత కొన్నిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే అస్సలు నిద్రపట్టన్నట్లు.. ఎప్పుడూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వివాదాలను తీసుకోస్తూనే ఉంటాడు.

Shivakrishna

గత కొన్నిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే అస్సలు నిద్రపట్టన్నట్లు.. ఎప్పుడూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వివాదాలను తీసుకోస్తూనే ఉంటాడు. ఇక ఈ మధ్యన ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మండిపడడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని నిలదీస్తున్నట్లు వీడియోలు పెడుతూ వస్తున్నాడు. ఈ వీడియోలకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం అర్ధం లేకుండా మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ ని సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాన్ అవ్వడం ప్రకాష్ రాజ్ కి కొత్తేమీ కాదు. ఇలాగే గతంలో సనాతన ధర్మం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి టాలీవుడ్ లో బ్యాన్ అయ్యేవరకు తెచ్చుకున్నాడట. ఈ విషయాన్ని నటుడు శివకృష్ణ (Shivakrishna) ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూ పాతదే అయినా ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేస్తోన్న రచ్చతో ఈ వీడియో మళ్లీ వైరల్ గా మారింది.


టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాష్ రాజ్‌ రామలక్ష్మణులు నార్త్ నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ చేసిన కామెంట్స్ పై స్పందించారు. సనాతన ధర్మం, హిందూ మతంపై ప్రకాష్ రాజ్ వరుసగా చేస్తున్న నెగెటివ్ కామెంట్లపై శివకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ గత చరిత్రను గుర్తుచేస్తూ, ఒకప్పుడు ఆయన ప్రవర్తన నచ్చక టాలీవుడ్ నుంచి ఎలా బ్యాన్ చేయాల్సి వచ్చిందో శివకృష్ణ ఈ ఇంటర్వ్యూలోచెప్పుకొచ్చారు. అజ్ఞానంతో కూడిన కండకావరంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.


గతంలో ప్రకాష్ రాజ్ ఒక జాతి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తామంతా కలిసి ఆయన్ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశామని శివకృష్ణ వెల్లడించారు. ఆ సమయంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్పందిస్తూ.. ‘అంతా లీగల్‌గానే ఉంది, ప్రొసీడ్ అవ్వండి’ అని మద్దతు పలికారని, అటు కింగ్ నాగార్జున కూడా ప్రకాష్ రాజ్ చేసిన పనిని అస్సలు ఊరుకోలేదని గుర్తుచేశారు. ఆ బ్యాన్ తర్వాత ప్రకాష్ రాజ్ స్వయంగా ఇంటికి వచ్చి నన్ను వదిలేయండి అని బతిమలాడుకున్నాడని శివకృష్ణ సంచలన విషయాన్ని లీక్ చేశారు. నాడు అంతలా దిగివచ్చిన వ్యక్తి.. ఈరోజు హిందూ మతంపై ఇన్ని దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఇండస్ట్రీ ఎందుకు సైలెంట్‌గా ఉందంటూ ఆయన ప్రశ్నించారు.


సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని శివకృష్ణ హెచ్చరించారు. హిందూ మతాన్ని అవమానిస్తున్న ప్రకాష్ రాజ్‌ను టాలీవుడ్ సినిమాల నుంచి తక్షణమే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాటి అగ్ర హీరోల సపోర్ట్‌తో బ్యాన్ అయిన ప్రకాష్ రాజ్ హిస్టరీని, నేటి ఆయన వైఖరిని ఎండగడుతూ శివకృష్ణ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తోంది. అప్పుట్లో వాళ్ళు చేసినట్లే ఇప్పుడు కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 08:54 PM