పెళ్లి పీటలు ఎక్కనున్న మరో కుర్ర హీరో..
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:02 PM
ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక ఇంటివారయ్యారు.
ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక ఇంటివారయ్యారు. కొద్దిసేపటిలో అల్లు శిరీష్ (Allu Sirish).. నయనికా రెడ్డి మెడలో తాళి కట్టబోతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెళ్ళి వేడుకలతో కళకళలాడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో కుర్ర హీరో కూడా ఈ ఏడాది పెళ్ళిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas).
కొన్ని నెలలుగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళిపీటలు ఎక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన లాయర్ కుమార్తెను సాయి శ్రీనివాస్ వివాహమాడబోతున్నారు. ఆమె పేరు కావ్య రెడ్డి అని సమాచారం. కావ్య రెడ్డి తాతగారు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారని, ఆమె తండ్రి ప్రస్తుతం లాయర్ గా పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బెల్లంకొండ ఫ్యామిలీ ఈ విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలియజేయనున్నారట.
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీని తరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు శ్రీనివాస్. గతేడాది భైరవం, కిష్కింధపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శ్రీనివాస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. టైసన్ నాయుడు, హైందవ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతోన్నాయి. మరి ఈ సినిమాలతో సాయి శ్రీనివాస్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.