రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ పూజలు.. ప్రేమలో ఉన్నారా

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:14 PM

ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతేనా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎప్పుడు ప్రేమలో పడతారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు విడిపోతారు అని చెప్పడం కూడా చాలా కష్టం.

Folk Singer Nagadurga

ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతేనా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎప్పుడు ప్రేమలో పడతారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు విడిపోతారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఒక హీరో హీరోయిన్ కలిసి బయట కనిపిస్తే వారి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకోస్తాయి. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj), ప్రముఖ ఫోక్ సింగర్ అండ్ డాన్సర్ నాగాదుర్గ (Nagadurga) కలిసి కనిపించడం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో అఖిల్ రాజ్- నాగదుర్గ ప్రత్యక్షమయ్యారు. కోయిల్ ఆవరణలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరిద్దరూ కలిసి గుడికి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే దానిపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. తెలంగాణ నేటివిటీతో రాబోతున్న ఒక క్రేజీ ప్రైవేట్ ఫోక్ సాంగ్ కోసమా లేదా నూతన ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారా అనే కోణంలో వార్తలు వస్తున్నాయి.


కేవలం సాధారణ దర్శనం, ప్రత్యేక పూజల కోసమే కొమురవెల్లికి వెళ్లారు అంటే వీరిద్దరూ అంతకుముందు నుంచే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయంలో ఈ జంటను చూసి స్థానిక భక్తులు, అభిమానులు ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. నాగదుర్గ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈమధ్యనే తమిళ్ లో లవ్ ఓ లవ్ సినిమాతో మెప్పించిన ఆమె తెలుగులో ఇడుపు కాయితం సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. మరి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Updated Date - Aug 11 , 2026 | 07:26 PM