హీరో అజిత్‌కు.. తప్పిన ఘోర‌ ప్రమాదం! రేసింగ్‌లో చేదు అనుభ‌వం

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:20 AM

యూరప్ ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.

Ajith Kumar

కోలీవుడ్ అగ్రహీరో, రేసర్ అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ కారుకు మరోమారు ప్రమాదం తప్పింది. యూరప్ వేదికగా ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ (europe endurance race) పోటీలు జరుగుతున్నాయి. ఈ రేసింగ్ పోటీల్లో అజిత్ కార్ రేసింగ్ బృం దం పాల్గొంది. అయితే, అజిత్ ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

అయితే, ఈ ప్రమాదం నుంచి అజి త్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అజిత్ కు మార్ 'గుడ్ బ్యాడ్లీ అగ్లీ' మూవీ తర్వాత ఆధిక్ రవిచంద్రన్ దర్శ కత్వంలో 'డేర్ డెవిల్స్' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి షాలిని అజిత్ కుమార్ నిర్మాతగా ఉన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 07:49 AM