Abbas: ఆఫర్స్ లేని టైమ్‌లో అన్నం పెట్టింది వాళ్లే..

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:09 PM

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం, వయస్సు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేకపోతే కష్టకాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. అలా ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులను చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొన్నారు.

Abbas

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం, వయస్సు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేకపోతే కష్టకాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. అలా ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులను చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొన్నారు. అందులో అబ్బాస్ (Abbas) కూడా ఒకరు. ప్రేమదేశం సినిమాతో ఓవర్ నైట్ లవర్ బాయ్ గా మారాడు అబ్బాస్. ఆ సమయంలో అబ్బాస్ కటింగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఇప్పటికీ చాలామంది కుర్రాళ్లు అబ్బాస్ కటింగ్ చేయించుకుంటున్నారు.


ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన అబ్బాస్.. ఒక్కసారిగా మాయమయ్యాడు. ఆ తరువాత హార్పిక్ యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ యాడ్ వలన ఆయన ఎన్నో విమర్శలు అందుకున్నాడు. ఆ యాడ్ తర్వాత ఆయన ఇండియాలోనే కనిపించలేదు. ఇక ఈ మధ్యనే ఆయన రీఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అబ్బాస్.. ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. అవకాశాలు లేని సమయంలో హార్పిక్ యాడ్ వలనే అన్నం తిన్నామని ఆయన తెలిపాడు.


'సినిమా అవకాశాలు లేక, చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేని కఠిన సమయంలో ఆ హార్పిక్ బ్రాండ్ నాకు ఎంతో అండగా నిలిచింది. దాదాపు 8 సంవత్సరాల పాటు ఆ యాడ్ కాంట్రాక్ట్ ద్వారా లభించిన డబ్బుతోనే ఆర్థికంగా స్థిరపడగలిగాను. ఆ బ్రాండ్ యాజమాన్యం అన్ని ఏళ్లు ఆర్థికంగా సపోర్ట్ చేసింది. సమాజం ఏమనుకున్నా సరే, నిజాయితీగా చెప్పాలంటే హార్పిక్ యాడ్ వలనే నా ప్లేట్ లోకి అన్నం వచ్చింది. వారే నాకు అన్నం పెట్టారు' అని ఎమోషనల్ అయ్యాడు. విమర్శలు వచ్చినా కూడా తాను పెద్దగా పట్టించుకోలేదని ఆయన తెలిపాడు.

Updated Date - Jun 07 , 2026 | 06:19 PM