Tyson Naidu Teaser: స్పెషల్ ఆపరేషన్ టీమ్.. నో అరెస్ట్.. నో రికార్డ్స్

ABN , Publish Date - Nov 18 , 2026 | 09:39 PM

కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం టైసన్ నాయుడు (Tyson Naidu). అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు.

Tyson Naidu

కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం టైసన్ నాయుడు (Tyson Naidu). అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుండి ఉంటే ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఉండేది. కానీ, కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు. టీజర్ లో కథ మొత్తాన్ని చూపించకపోయినా.. ఇదొక ఆపరేషన్ కి సంబంధించిన కథగా తెరకెక్కినట్లు చూపించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే కొంతమందిని అంతమొందించడానికి పోలీస్ అధికారులు ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేస్తారు. అదే స్పెషల్ ఆపరేషన్ టీమ్. దానికి హెడ్ గా శ్రీనివాస్ కనిపించాడు. ఇందులో అరెస్ట్ లు ఉండవు.. రికార్డులు ఉండవు. అయితే అనుకోకుండా ఒక వ్యక్తి.. ఈ టీమ్ నుంచి తప్పించుకున్నట్లు చూపించారు. దీనివెనుక ఒక కుట్ర ఉందని శ్రీనివాస్ కనిపెడతాడు. మరి ఆ కుట్ర చేసింది ఎవరు.. ? స్పెషల్ టీమ్ చివరకు అతడిని పట్టుకుంటుందా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


శ్రీనివాస్ కి పోలీస్ పాత్ర కొత్తేమీ కాదు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ హెడ్ గా ఆయన నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇక టీజర్ మాత్రమే కాబట్టి ఇందులో పూర్తి కథను చూపించలేదు. రావు రమేష్, నరేష్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. నేహా శెట్టి కూడా ఈసారి గ్లామర్ పాత్రలకే అంకితం కాకుండా మంచి పాత్ర చేసినట్లు కనిపిస్తుంది. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా మారనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 18 , 2026 | 09:45 PM