పొలిమేర 3.. బ్లాస్ట్ హీరో దిగుతున్నాడు

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:07 PM

కమెడియన్ పాత్రలతో మెప్పించిన సత్యం రాజేష్‌ (Satyam Rajesh) ను హీరోగా నిలబెట్టిన సినిమా మా ఊరి పొలిమేర (Maa Oori Polimera). అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజై అనూహ్య స్పందన తెచ్చుకుంది.

Polimera 3

కమెడియన్ పాత్రలతో మెప్పించిన సత్యం రాజేష్‌ (Satyam Rajesh) ను హీరోగా నిలబెట్టిన సినిమా మా ఊరి పొలిమేర (Maa Oori Polimera). అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజై అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ సంచలన విజయంతో మేకర్స్ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి థియేటర్లలో విడుదల చేసిన ‘పొలిమేర-2’ సైతం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఓటీటీలో చిన్నగా మొదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ ఇప్పుడు మూడో భాగంతో అంతకుమించిన పెద్ద రేంజిలో రావడానికి రంగం సిద్ధమవుతోంది.


ఈ క్రేజీ పొలిమేర-3 చిత్రానికి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషల్ అట్రాక్షన్ తోడైంది. సీనియర్ నటుడు, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన బ్లాస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ప్రస్తుతం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్, డిమాండ్ సంపాదించుకున్న అర్జున్‌ను ఈ ప్రాజెక్ట్ లోకి లాక్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా హైప్‌ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.


సత్యం రాజేష్ ఎప్పట్లాగే లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. పొలిమేర-2 చివర్లో పార్ట్-3కి ఇచ్చిన లీడ్ చూస్తే ఈ సినిమా మరింత భారీగా, ఊహించని ట్విస్టులతో ఉండబోతోందని స్పష్టమవుతోంది. అర్జున్ సర్జా లాంటి పవర్‌ఫుల్ నటుడు తోడవడంతో ఈ క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యం ఉన్న మిస్టరీ థ్రిల్లర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూడో భాగంతో అనిల్ విశ్వనాథ్ అండ్ టీం బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Jul 19 , 2026 | 01:08 PM