‘సుధీర్స్ జోకర్’ మూవీ నటి అభిరామి పాత్ర పేరు ఇదే

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:25 PM

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సుధీర్స్ జోకర్'. బిగ్‌బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సుధీర్స్ జోకర్'. బిగ్‌బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. 

అభిరామి ఈ సినిమాలో 'గాయత్రీ దేవి' పాత్రలో కనిపించనున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో 'అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది' అనే క్యాప్షన్  ఇచ్చారు. . పోస్టర్‌ను బట్టి చూస్తే గాయత్రీ దేవి పాత్ర భావోద్వేగాలకు పెద్దపీట వేసేలా ఉండబోతోందని తెలుస్తోంది. అభిరామి నటనకు తగ్గట్టుగా ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. 

పీఎస్ సునీల్ పుప్పాల రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పి.వి. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jul 31 , 2026 | 02:27 PM