తెలుగు సినిమాకు.. ఆమిర్ ఖాన్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్  

ABN , Publish Date - Mar 21 , 2026 | 07:28 PM

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'డెకాయిట్‌' చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'డెకాయిట్‌'. మృణాల్ ఠాకూర్ కథానాయిక. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె  జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా  ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ దుస్తుల్లో తుపాకీ గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను చూసిన ఆమిర్ ఖాన్  అభినందనలు తెలుపుతూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రమిది.  ఏప్రిల్ 10న  ప్రేక్షాకుల ముందుకు రానుంది. లవ్, హార్ట్‌బ్రేక్, యాక్షన్ తో ప్రేక్షకులకి  సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ను ఈ సినిమా ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు.  

Updated Date - Mar 21 , 2026 | 08:36 PM