‘వెంకట్రామయ్య గారి తాలుకా’.. ‘ఆడుకున్న దిక్కడే’ పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:55 AM
దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ జంటగా నటించిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలుకా.
దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ జంటగా నటించిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలుకా. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది.. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పాటలు ఆకట్టుకోగా తాజాగా మూడో గీతం ఆడుకున్న దిక్కడే లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.