Sub Inspector Yugandhar: ఇదెప్పుడు థియేటర్ లో రిలీజ్ అయ్యింది చెప్మా

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:30 PM

ప్రముఖ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్ (Aadi Saikumar). మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నా ఆ తరువాత ఆశించిన ఫలితాలను అందుకోలేక కొన్నేళ్ళు ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు.

SI Yugandhar

ప్రముఖ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్ (Aadi Saikumar). మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నా ఆ తరువాత ఆశించిన ఫలితాలను అందుకోలేక కొన్నేళ్ళు ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. ఇక గతేడాది శంబాల సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆది వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నాడు. ఈ మధ్య రుద్ర సినిమాని అధికారికంగా ప్రకటించాడు.


ఇక తాజాగా ఆయన నటించిన 'ఎస్‌ఐ యుగంధర్' (SI Yugandhar) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది సరసన మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ ని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది పవర్ ఫుల్ పోలీసాఫీర్ గా కనిపించాడు. అసలు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. దీంతో ఈ ఓటీటీ న్యూస్ తెలియగానే నెటిజన్స్.. ఇదెప్పుడు రిలీజ్ అయ్యింది.. అప్పుడే ఓటీటీకి కూడా వస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


కథ విషయనకొస్తే సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్ (ఆది సాయికుమార్) నగరంలో ఒక నిజాయితీ గల, ముక్కుసూటిగా వెళ్లే పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని గౌరవిస్తూ, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించే రకం. ఒకరోజు నగర శివార్లలో అనుమానాస్పద స్థితిలో ఒక రహస్యమైన మృతదేహం లభ్యమవుతుంది. ఆ కేసును దర్యాప్తు చేసే బాధ్యత యుగంధర్ పై పడుతుంది. మొదట ఇది సాధారణ హత్య కేసులా అనిపించినప్పటికీ, యుగంధర్ విచారణ లోతుగా చేసే కొద్దీ షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. ఆ మృతదేహానికి, నగరంలో జరుగుతున్న కొన్ని హై-ప్రొఫైల్ కిడ్నాప్‌లకు, అక్రమ దందాలకు సంబంధం ఉందని యుగంధర్ గుర్తిస్తాడు. ఈ దర్యాప్తు ప్రక్రియలో అతనికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. డిపార్ట్‌మెంట్‌లోని కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ కేసును క్లోజ్ చేయమని అతనిపై ఒత్తిడి తెస్తారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా లొంగని యుగంధర్, ఈ నేరాల వెనుక ఎవరు ఉన్నారు.. ? తన తెలివితేటలతో, ప్రాణాలకు తెగించి ఆ విలన్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు? ఆ రహస్య మృతదేహం వెనుక ఉన్న అసలు మిస్టరీని ఎలా చేధించాడు? అనేదే సినిమా కథ.మరి థియేటర్ లో హిట్ కానీ ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 25 , 2026 | 07:36 PM