'సైరాబాను'.. అంటున్న ఆది సాయికుమార్
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:00 PM
శంబాల వంటి హిట్ తర్వాత ఆది సాయికుమార్ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
శంబాల వంటి హిట్ తర్వాత ఆది సాయి కుమార్ (Aadi Saikumar) సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థ హాస్య బ్యానర్ (Hasya Movies)పై రాజేశ్ దండా (Razesh Danda) నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు, హీరోయిన్, డైరెక్టర్... ఇతర వివరాలను వెల్లడించారు.
ఈ చిత్రానికి సైరాబాను (Saira Banu) అనే పేరు ఫైనల్ చేయగా.. 'మసూద' బ్యూటీ బాంధవి శ్రీధర్ ( Bandhavi Sridhar) హీరోయిన్‌గా నటించనుంది. ఫణి కృష్ణ సిరికి ( Phani Krishna Siriki) దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు చిత్ర బృందం శుక్రవారం పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు అధికారికంగా ప్రకటించారు.