ఆది సాయికుమార్ మరో సినిమా ‘జంగిల్'

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:10 PM

‘శంబాల’ చిత్రంతో హిట్ అందుకున్నారు ఆది సాయి కుమార్(Aadi Saikumar).  తాజాగా ఆయన హీరోగా, వేదిక (Vedika) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘జంగిల్’ (Jungle).

‘శంబాల’ చిత్రంతో హిట్ అందుకున్నారు ఆది సాయి కుమార్(Aadi Saikumar).  తాజాగా ఆయన హీరోగా, వేదిక (Vedika) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘జంగిల్’ (Jungle). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ పొందటం  విశేషం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.    



సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది.  ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.  వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.  హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.  త్వరలో ఫస్ట్ లుక్‌, ట్రైలర్‌ ను విడుదల చేస్తాం' అని మేకర్స్ తెలిపారు. 

Updated Date - Feb 09 , 2026 | 08:10 PM