Mana Shankara Vara Prasad Garu : సినిమా చూస్తూ అభిమాని మృతి!
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:02 PM
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన ‘మన శంకర్ వరప్రసాద్‌గారు’ చిత్రం నడుస్తున్న థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన ‘మన శంకర్ వరప్రసాద్‌గారు’ చిత్రం నడుస్తున్న థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో సినిమా వీక్షించడానికి వచ్చిన అభిమాని ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికి చలనం లేకపోవడంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడు గుండెపోటుతో మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోమవారంప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.