Chandrahass: బూతు పాట‌.. చంద్రహాస్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:28 PM

టీవీ న‌టుడు ప్ర‌భాక‌ర్ కుమారుడు, ఆటీట్యూడ్ స్టార్ చంద్ర‌హాస్ (Chandrahass) హీరోగా బ‌రాబ‌ర్ ప్రేమిస్తా అనే చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిం

Chandrahass

టీవీ న‌టుడు ప్ర‌భాక‌ర్ కుమారుడు, ఆటీట్యూడ్ స్టార్ చంద్ర‌హాస్ (Chandrahass) హీరోగా బ‌రాబ‌ర్ ప్రేమిస్తా (Barabar Premistha) అనే చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 6న థియేట‌ర్లకు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) నిర్వ‌హించ‌గా ఆది సాయికుమార్‌, జేడీ చ‌క్ర‌వ‌ర్తి (JD Chakravarthy), ద‌ర్శ‌కుడు జ‌యంత్ సీ ప‌రాన్జీ వంటి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

అయితే.. కార్యక్ర‌మంలో భాగంగా అక్క‌డికి వ‌చ్చిన‌ వారిని ఉత్సాహ ప‌రిచే క్ర‌మంలో హీరో చంద్ర‌హాస్ స్వ‌యంగా పాట పాడారు. అయితే ఆ పాట కాస్త‌ పూర్తిగాబూతుల‌మ‌యంగా ఉండ‌డంతో అక్క‌డికి వ‌చ్చిన వారు, విన్న‌వారు షాక‌య్యారు. అది కాస్త లైవ్ ప్రోగ్రాం కావ‌డంతో అనేక మందికి క్ష‌ణాల్లో చేరువైపోయింది. దీంతో ఆ పాట విన్న‌వారంతా ఖంగు తిన‌డ‌మే కాక పాట పాడిన చంద్ర హాస్‌పై విరుచుకు ప‌డుతున్నారు.

ఓ ప‌బ్లిక్ వేదిక‌పై ఎలాంటి పాట‌లు పాడాలో తెలియ‌దా అంటూ మండి ప‌డుతున్నారు. ఇక నెటిజ‌న్లు అయితే సోష‌ల్ మీడియాలో చెప్ప‌రాని మాట‌ల‌తో దుమ్మెత్తి పోస్తున్నారు. అందులో కొంద‌రు స‌ద‌రు పాట పాడిన హీరో బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లి త‌ప్పు చేశాం క్ష‌మించండి అంటూ స్వ‌యంగా వీడియోలు సైతం రిలీజ్ చేశారు. చంద్ర‌హాస్ మాత్రం నేను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను అంటూ త‌న‌పై కామెంట్లు చేసే వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు. .ఈవెంట్‌లో పాట పాడిన చంద్రహాస్‌పై మాదాపూర్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడైన చంద్రహాస్‌ ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బూత్‌ పాటలు పాడడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్‌ పోలీసులు ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 05 , 2026 | 04:18 PM