The Raja Saab: ‘ది రాజా సాబ్’.. 8 నిమిషాల అదనపు సీన్లు కలిపారు! ఓల్డ్ ప్రభాస్ వచ్చేశాడు
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:50 PM
ప్రభాస్ హీరోగా శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ది రాజాసాబ్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా, మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ స్టామినా మరోసారి రుజువైంది.
శనివారం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ మంచి స్పందన కనిపించడంతో వీకెండ్ కలెక్షన్లు బలంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానీ ఫాంటసీ, హారర్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. అయితే.. అభిమానుల అంచనాలు అధికంగా ఉండటం, ట్రైలర్లో చూపిన కీ సీన్లు మిస్ అవడం వళ్ల సినిమాపై నెగిటివిటీ వినిపించినా, సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రాజా సాబ్ చిత్ర బృందం సిద్ధమైంది. తాజాగా శనివారం సాయంత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించిన మేకర్స్ థియేటర్లలో నేటి నుంచి ప్రభాస్ ఓల్డ్ గెటప్‌కు సంబంధించిన సుమారు 8 నిమిషాల అదనపు సన్నివేశాలను జోడిస్తున్నట్లు దర్శకుడు మారుతి అధికారికంగా ప్రకటించారు. అలాగే అనవసరం అనిపించిన కొన్ని సన్నివేశాలు సైతం తొలగించినట్లు తెలిపారు. అయితే.. టీజర్లలో కనిపించిన ప్రభాస్ లుక్ సినిమాలో పూర్తిగా లేకపోవడంతో కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు.
ఇదిలావుంటే.. రాజాసాబ్.. మిక్డ్స్ టాక్ ఉన్నా కూడా నిన్న నైట్ షోస్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రోజు కూడా బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఫ్యామిలీ ఆడిషన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెస్టేషన్స్ పెట్టుకోవడం వలన కాస్త నెగిటివిటి వచ్చింది కాని.. జనరల్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ముఖ్యంగా దర్శకుడు మారుతీ తన జానర్ దాటి చేసిన కొత్త ప్రయత్నం బాగుందని వింటేజ్ ప్రభాస్ ని చూసామని.. తనదైన కామెడీ టైమింగ్స్ తో ఎంటర్టైన్ చేసాడని రెస్పాన్స్ ఉంది. ప్రభాస్ ని డీల్ చేయడంలో మారుతీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. దానికి తోడు ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ కనిపించే సీన్స్ నేటి నుండి యాడ్ చేస్తామని మారుతి తెలిపాడు. ఈ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. కొద్దిగా ప్రమోషన్స్ చేస్తే పండగ రోజుల్లో ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.