వామ్మో.. ఒక్క రాత్రికి 2.6 లక్షలా! విజయ్, రష్మిక ఉన్న విల్లా ప్రత్యేకతలు తెలుసా..!
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:47 PM
పెళ్లి తర్వాత సాధారణంగా జంటలు హనీమూన్‌కు వెళ్లడం చూస్తాం, కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మాత్రం విభిన్నంగా 'బడ్డీ మూన్'ను ప్లాన్ చేసుకున్నారు.
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత సాధారణంగా జంటలు హనీమూన్‌కు వెళ్లడం చూస్తాం, కానీ ఈ జంట మాత్రం విభిన్నంగా 'బడ్డీ మూన్'ను ప్లాన్ చేసుకున్నారు. కేవలం ఇద్దరే కాకుండా తమ సన్నిహిత మిత్రులతో కలిసి థాయ్‌లాండ్‌లోని అందమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే ఈ ట్రిప్‌ను 'బడ్డీ మూన్'గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వెకేషన్ కోసం వారు థాయ్‌లాండ్‌లోని రెండో అతిపెద్ద ద్వీపమైన 'కో-సముయ్' ఐల్యాండ్‌లో అత్యంత ఖరీదైన 'కో కూన్' అనే విల్లాను బుక్ చేశారు. చావెంగ్ నోయి కొండలపై ఉన్న ఈ విల్లా ఆధునిక డిజైన్, ప్రకృతి అందాల సమాహారంగా నిలుస్తుంది. ఇందులో మొత్తం 9 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. హనీమూన్ జంట కోసం ప్రత్యేక గది ఉండగా, మిగిలినవి గెస్టుల కోసం కేటాయించారు. ఈ విల్లాను పూర్తిగా ఒక గ్రూపునకే ఇస్తారు కాబట్టి, ఇతర పర్యాటకుల ప్రమేయం ఉండదు. సముద్రపు అందాలు కనిపించేలా ఓపెన్ సిట్టింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ వంటి సౌకర్యాలు ఈ విల్లాలో అదనపు ఆకర్షణలు.
ఈ విల్లాలో లభించే సౌకర్యాలు 5-స్టార్ హోటల్ లగ్జరీలను తలపిస్తున్నాయి. ఏషియన్ బ్రేక్ ఫాస్ట్, లిక్కర్, స్పెషల్ మేనేజర్ సేవలు, ఎయిర్ పోర్టు పికప్-డ్రాపింగ్, నిరంతర హౌజ్ కీపింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ విలాసాల ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఈ విల్లాలో ఒక రాత్రి గడపాలంటే దాదాపు రూ. 2.6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కనీసం మూడు రాత్రులు బుక్ చేసుకోవాలి కాబట్టి, మూడు రోజులకు గాను సుమారు రూ. 7.8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ భారీ ధర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
రష్మిక ఈ వెకేషన్‌కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో విజయ్, రష్మిక కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం, సరదాగా డాన్స్ చేయడం వంటి దృశ్యాలు అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌ను 'నా భర్త' అని పిలవడం తనకు ఇంకా అలవాటు కాలేదని, అలా పిలవడం చాలా కొత్తగా, మురిపెంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ వీడియో మేకింగ్ చూస్తుంటే, ఇది కేవలం వ్యక్తిగత వీడియోలా కాకుండా సదరు విల్లా ప్రమోషన్‌లో భాగంగా తీసినట్లు ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.