'100 డేస్ లవ్ స్టోరీ'.. ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడి
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:14 AM
జయ శివ సూర్య, ఇషా మనోహరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం '100 డేస్ లవ్ స్టోరీ' (100 Days love story). 'అతి ప్రేమ భయానకం' అన్నది ఉపశీర్షిక.
జయ శివ సూర్య, ఇషా మనోహరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం '100 డేస్ లవ్ స్టోరీ' (100 Days love story). 'అతి ప్రేమ భయానకం' అన్నది ఉపశీర్షిక. విజయ మిత్ర దర్శకత్వం వహిస్తున్నారు. పురిపండా వెంకటరమణ మూర్తి శర్మ నిర్మిస్తున్నారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'ప్రేమ కథాచిత్రాల్లో ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. దర్శకుడు విజయమిత్ర కథను డీల్ చేసిన విధానం, హీరో హీరోయిన్ల నటన ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము' అని తెలిపారు.