నాగబంధం కోసం.. 500 సంవత్సరాల పూర్వం వాయిద్యాల గురించి రీసెర్చ్ చేశాం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:01 PM
నాగబంధం చిత్రంతో సంగీత దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు జునైద్ కుమార్.
'కార్తికేయ 2. 'బలగం', 'విరాట పర్వం' వంటి ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతకారునిగా పనిచేసిన జునైద్ కుమార్ (Junaid Kumar) నాగబంధం (Nagabandham) చిత్రంతో సంగీత దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం. విజయవంతంగా ప్రదర్శితమవున్న నేపథ్యంలో జునైద్ కుమార్ 'చిత్రజ్యోతి'తో ముచ్చటించారు.
ప్రస్తుతం 'నాగబందం' విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ సినిమాలో మా సంగీతానికి, ముఖ్యంగా బీజీఎంకు మంచి ప్రశంసలు దక్కుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో నన్ను నేను నిరూపించుకునే ఆవకాశం రావడం. తొలి సినిమాకే మంచి గుర్తింపు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా మా తాత సజన్ మంచి మ్యూజిక్ కంపోజర్. ఆయన ఎక్కువగా హిందీ కమర్షియల్ యాడ్స్‌కు పనిచేశారు. ఆయనే నాకు స్ఫూర్తి, ఇళయరాజా, ఆర్తో బర్మన్, ఎసీ బర్మన్ వంటి సంగీత దిగ్గ జాలు స్వరపరచిన పాటలు, మహ్మద్ రఫీ ఆల పించిన మధుర గీతాలను మా తాత నాకు ప్రత్యే కంగా వినిపించేవారు.
మ్యూజిక్ కంపోజింగ్లో వాళ్లు ఏ ఇన్స్ట్రుమెంట్ ను ఎలా వాడారో వివరించే వారు పాటలో పల్లవి, చరణం ఎంత ఉండాలో చెప్పేవారు. దాంతో నాకు కూడా సింగర్ కావాలనే కోరిక కలిగింది. కానీ కాలక్రమేణా మ్యూజిక్ ప్రోగ్రామింగ్ పై మనసు మళ్లింది. ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆయన వద్దే శిష్యరికం చేశాను ఆయనే నన్ను ఒక మంచి మ్యుజీషియన్‌గా తీర్చిదిద్దారు. సినిమాలో నాకు తొలి అవకాశం ఇచ్చింది మాత్రం సురేశ్ బొబ్సిలి.
'నమోరే' పాట కంపోజింగ్ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. అప్పుడే అనిపించింది, ఈ పాట బాగా పాపులర్ అవుతుందని, ఈ చిత్రంలో అబ్దాలి అనే శక్తిమంతమైన విలన్ క్యారెక్టర్ ఉంది. ఆయన అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఆ సన్నివేశాల బీజీఎం కోసం దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల పూర్వం ఉపయోగించిన సంగీత వాయిద్య పరికరాల గురించి చాలా రీసెర్చ్ చేశాము. రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా కొన్ని ప్రత్యేకమైన అంటే వైకింగ్ వంటి పరికరాలను ఉపయోగించాము.