Tharun Bhascker: గాయపడ్డ సింహం ఏం చేసింది!?
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:48 PM
తరుణ్ భాస్కర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'గాయపడ్డ సింహం'. కశ్యప్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి, భానుకిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ బన్సల్ దీనిని నిర్మించారు. మే 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఇందులో కీలక పాత్రలు పోషించిన ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి సైతం మూవీ విశేషాలను వివరించారు. మానసా చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జీ స్టూడియోస్ సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ప్రేమను నిలబెట్టుకోవడానికి అమెరికా వెళ్ళి... అక్కడ నుండి తిరస్కరణకు గురై గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చిన ఓ యువకుడి కథ ఇది. అతని లక్ష్యం ఏమిటీ? దానిని సాధించడంలో ఎందుకు విఫలమయ్యాడు? దాని నుంచి బయటకు రావడానికి ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏమిటనేదే 'గాయపడ్డ సింహం' కథ.