‘శ్రీనివాస మంగాపురం’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:53 PM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు జై కృష్ణ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

NSR Interview with Srinivasa Mangapuram Team

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు జై కృష్ణ (Jay Krishna) హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivas Mangapuram). బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ‘RX 100’, ‘మంగళవారం’ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్, జెమినీ కిరణ్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందంతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ..


ఈ కార్యక్రమంలో హీరో జై కృష్ణ మాట్లాడుతూ.. తన బాబాయి మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలైన జూలై 30వ తేదీనే తన డెబ్యూ సినిమా కూడా విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నటుడిగా మారడానికి ముంబై, న్యూయార్క్, పాండిచ్చేరిలలో నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. కథపై ఉన్న నమ్మకమే తనలో ప్రెజర్ లేకుండా చేసిందని, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనేది తనకు భారం కాదని, అదొక కొండంత అండ అని స్పష్టం చేశారు. నటి రాషా తడానీ మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, దిగ్గజ నటుడు మోహన్ బాబుతో కలసి నటించడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.


దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. తాను స్టార్ కిడ్స్ అనే ప్రెజర్ లేకుండా, కథకు తగిన నటీనటులుగానే జై కృష్ణ, రాషాలను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అత్యంత పవర్‌ఫుల్, హుందాతనంతో కూడిన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలను పెంచాయని, ఈ లవ్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇంకా టీమ్ చెప్పిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

మోహన్‌ రాజా సరికొత్త అవతారం.. ఈ ట్విస్ట్ ఏంటి

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 29 , 2026 | 02:53 PM