K. Raghavendra Rao: మురళీమోహన్ చెప్పిన 50 యేళ్ళ 'జ్యోతి' ముచ్చట్లు!
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:30 PM
శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన రెండో సినిమా 'జ్యోతి'. ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మురళీమోహన్‌తో జరిగిన ప్రత్యేక ముఖాముఖి.
కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'బాబు' (Babu). ఆ సినిమా 1975లో విడుదల కాగా, రెండో సినిమా 'జ్యోతి' (Jyothi) 1976 జూన్ 3న జనం ముందుకు వచ్చింది. జయసుధ (Jayasudha), మురళీ మోహన్ (Murali Mohan), గుమ్మడి (Gummadi) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కె. రాఘవేంద్రరావుకు తొలి విజయాన్ని అందించడంతో పాటు మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. జ్యోతి సినిమా విడుదలై ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ హెచ్ ఎన్.ఎస్.ఆర్. సీనియర్ నటుడు మురళీ మోహన్‌తో చేసిన ఇంటర్వ్యూ...