‘కొరియన్ కనకరాజు’ డైరెక్టర్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:44 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు గాంధీ చెప్పిన ముచ్చట్లివే..

Merlapaka Gandhi interview

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందకు సిద్ధమైన ఈ చిత్ర దర్శకుడితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ..


ఈ ఇంటర్వ్యూలో మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన ఒక స్థానిక కుర్రాడికి ఒక కొరియన్ ఆత్మ (Korean Soul) పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం. హీరో వరుణ్ తేజ్ బాడీలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాత అనంతపురం స్లాంగ్, కొరియన్ లాంగ్వేజ్‌లో మాట్లాడే క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వరుణ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్‌గా, ఫోటోగ్రాఫర్ పాత్రలో సత్య నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ఫన్ అండ్ కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది హీరోయిన్ రితిక.. కియా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిగా కనిపిస్తుంది. నిజజీవితంలో కూడా ఆమెకు కొరియా కల్చర్, భాషపై పట్టు ఉండడం ఈ పాత్రకు బాగా కలిసొచ్చింది.

సినిమా మొత్తం 74 రోజుల్లో పూర్తయింది. అందులో 20 రోజులు కొరియాలో, 10 రోజులు కజకిస్తాన్‌లోని ఆల్మటీ డ్యామ్ దగ్గర, మిగతా భాగం ఇండియాలో షూట్ చేశాం. తక్కువ రోజుల్లో, నిర్దేశిత బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం. రాయలసీమ మాస్ బీట్లకు కొరియన్ ఫ్లేవర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని జోడించి థమన్ అద్భుతంగా సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన చెప్పిన మరిన్ని విశేషాల కోసం క్రింది వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి:

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

మోహన్‌ రాజా సరికొత్త అవతారం.. ఈ ట్విస్ట్ ఏంటి

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 29 , 2026 | 04:44 PM