Dappu Srinu: ప్రజా నాట్యమండలి నుంచి అయ్యప్ప దీక్ష వైపు.. ఎలా?

ABN, Publish Date - Sep 06 , 2026 | 11:08 AM

డప్పు శ్రీను.. అయ్యప్ప భక్తులకు సుపరిచితమైన పేరు.   తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భజన పాటలకు కేరాఫ్ ఆయన. 30 ఏళ్లకు పైగా అయ్యప్ప భజనలతో అలరిస్తున్నారు. ఆయన పాడిన 'మల్లెపూల పల్లకి సాంగ్ ఎంత పాపులరో అందరికి తెలిసిందే. ఆ పాటను ఇరుముడి చిత్రంలో రీ క్రియేట్ చేశారు. ఆ విషయాలు అయన మాటల్లోనే.. 

రవితేజ (Raviteja) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఇరుముడి’ (irumudi) చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే! ఈ చిత్రం సక్సెస్‌లో ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ సాంగ్‌ కూడా కీలక పాత్ర వహించింది. 26 ఏళ్ల అయ్యప్ప భక్తుడు డప్పు శ్రీను (Dappu Srinu)రికార్డ్‌ చేసిన ఈ పాటను శివ నిర్వాణ ఈ చిత్రంలో కొత్త హంగులుదిద్ది ఈ పాటను రీక్రియేట్‌ చేశారు. సినిమా విడుదలైన తర్వాత తెరపై పాటను చూసిన ఆడియన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. థియేటర్‌లో హారతులిస్తున్నారు. ప్రజానాట్యమండలితో పాటలు కెరీర్‌ మొదలుపెట్టిన డప్పు శ్రీను అయ్యప్ప దీక్షవైపు ఎలా వెళ్లారు.. అయ్యప్ప పాటలతో ఎలా మమేకం అయ్యారు? అన్నది ఆయన మాటల్లోనే..

Updated at - Sep 06 , 2026 | 11:46 AM